– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఇందిర (22) మహిళకు ఓ నెగిటివ్ రక్తం అత్యవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. ఈ క్రమంలో ఆయన రిజర్వడ్ యస్ఐ సాయి ప్రసన్నను సంప్రదించి వెంటనే స్పందించి ఓ నెగటివ్ రక్తాన్ని రెయిన్బో రక్తనిధి కేంద్రంలో అందజేశామని బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. ప్రజలను రక్షించే ఎస్సైగా ఉంటూనే మహిళ ప్రాణాలను కాపాడడం కోసం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన సాయి ప్రసన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సైఫ్,బట్టు భరద్వాజ్ లు పాల్గొన్నారు.
మానవత్వాన్ని చాటుకున్న ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



