Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ బాలల సైన్సు అవగాహన కార్యక్రమం

జాతీయ బాలల సైన్సు అవగాహన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్   
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెర్కి ట్ తెలుగు మీడియంలో 32వ జాతీయ బాలల సైన్స్ డివిజన్ టీచర్లకుజిల్లా స్థాయి బాలలసైన్స్ కాంగ్రెస్ లోపాల్గొనడానికి సన్నద్ధం చేయడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా సైన్స్ అధికారి కే గంగా కిషన్ శుక్రవారం తెలిపారు. ఈ సంవత్సరం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టెన్బిలిటీ అను ప్రధాన అంశంలో ఐదు ఉప అంశాలపై సమస్యలను స్థానికంగా ఎంచుకొని శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారాన్ని కనుగొని ప్రాజెక్టు రూపంలో తయారు చేయవలెనని తెలిపారు. గైడ్ టీచర్లు విద్యార్థులతో ప్రాజెక్టును రూపొందింపజేసి జిల్లా స్థాయిలో అక్టోబర్ రెండవ వారంలో నిర్వహించబోయే బాలల సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్  రిసోర్స్పర్సన్స్  కే గంగ కుమార్, శేఖర్ ,ఎస్ మల్లేష్, ఎం  సురేష్ కుమార్ లుఅవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్  వివిధ పాఠశాల నుండి సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -