Saturday, August 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి

నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి

- Advertisement -

కల్వకుంట్ల కవిత డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ కార్యక్ర మంలో ఆమె మాట్లాడారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు తీర్మానాలు చేశాయని ఆమె గుర్తుచేశారు. కార్మికులకు, ఉద్యోగులకు, టీచర్లకు అన్యాయం జరగనివ్వబోమని ఆమె స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కార్మికుల ఫ్రెండ్లీగా అండగా ఉంటుందని తెలిపారు. పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అంటే ఆ దేశంలో పనిచేసే ప్రజలకు సంతోషంగా పనిచేసే వాతావారణం కల్పించాలన్నారు. ట్రేడ్ యూనియన్ అంటే రాజ్యాంగ బద్దంగా మనకు దక్కిన హక్కు అనీ, దాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో కనీస వేతనం రూ.20 వేలు ఉండాలని, సీఎం అయ్యాకేమో రూ.16 వేలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. షెడ్యూల్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను చలాన్ల పేరుతో శ్రమదోపిడీ చేస్తున్నారనీ, ఐటీ, పార్మా రంగాల్లో యూనియన్లు లేకపోవడంతో అక్కడా అదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే దేశం ముందుకెళ్తుందనీ, అలాంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -