విజేతలకు నియామక పత్రాలు అందజేత
నవతెలంగాణ-పటాన్‌చెరు
హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్యలో విద్యార్థులు సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తిస్తూ శుక్రవారం ‘అచీవర్స్ డే 2026’ ను ఉత్సాహంగా నిర్వహించింది. ఈ సందర్భంగా 2026లో గ్రాడ్యుయేట్ బ్యాచ్‌కు సంబంధించిన ప్రాంగణ నియామక ఫలితాలను గీతం ప్రకటించింది. జులై 2026 నాటికి, ప్రాంగణ నియామకాలను ఎంచుకున్న 1,347 మంది విద్యార్థుల్లో 771 మంది (60శాతం) ప్లేస్‌మెంట్లు సాధించారు. విశ్వవిద్యాలయంలోని ఏడు స్కూళ్లలో 324 ప్రముఖ నియామక సంస్థల ద్వారా వెయ్యికి పైగా ఉద్యోగ ఆఫర్లు అందించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) 97.5 శాతం ఓవరాల్ ప్లేస్‌మెంట్ రేటుతో అగ్రగామిగా నిలిచింది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో వంద శాతం, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో 95.8శాతం ప్లేస్‌మెంట్లను సాధించింది. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్‌ఏ) కూడా వంద శాతం ప్లేస్‌మెంట్లను నమోదు చేసింది. స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు 6.94 లక్షల వార్షిక ప్యాకేజీతో అత్యధిక సగటును సాధించగా, గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 544 ఉద్యోగ ఆఫర్లతో, 443 మంది విద్యార్థుల ప్రాంగణ నియామకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో అత్యధికంగా 16 లక్షల వార్షిక జీతం ప్యాకేజీని గీతం విద్యార్థులు సాధించారు. ఈ కార్యక్రమానికి పీడబ్యూసీ ఏసీ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేషన్స్ లీడర్ (టాక్స్) జీ.టీ. కృష్ణ చైతన్య, టీసీఎస్ ప్రాంతీయ అధిపతి (అకడమిక్ అలయన్సెస్) రిచర్డ్ కింగ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతర అభ్యాసం, ఆవిష్కరణ, వృత్తిపరమైన నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విజేతలకు కెరీర్ ఫుల్ ఫిల్‌మెంట్ సర్టిఫికెట్లను అందజేశారు. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు మాట్లాడుతూ ‘గీతం విద్యా ప్రమాణాలు, కెరీర్-సిద్ధత కార్యక్రమాలపై పరిశ్రమకు ఉన్న నిరంతర విశ్వాసాన్ని ఈ ఏడాది ప్లేస్‌మెంట్ సీజన్ ప్రతిబింబిస్తోంది. మా విద్యార్థులకు మరిన్ని కెరీర్ అవకాశాలను కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. విజేతలైన జి.సజన్ (సీఎస్‌ఈ), డి.వీణాశ్రీ (సీఎస్‌ఈ-ఏఐఎంఎల్), ఇ.జె.సంఘమిత్ర (ఈఈసీఈ), నిహారిక నోముల (ఎంబీఏ), పమిశెట్టి ప్రేమ్ కుమార్ (ఎమ్మెస్సీ డేటా సైన్స్) తమ ప్లేస్‌మెంట్ అనుభవాలను, విజయగాథలను పంచుకున్నారు. తల్లిదండ్రుల తరఫున జి.సజన్ తండ్రి ఎన్.వి. శ్రీనివాస్ స్వరూప్, విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థను, కెరీర్ మార్గదర్శకత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ వడ్డి, ప్రొఫెసర్ జి.శివకుమార్, డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, డాక్టర్ మోతహర్ రెజా, డాక్టర్ బందన్ కుమార్ మిశ్రా, డాక్టర్ శామ్యూల్, థరు, కెరీర్ గైడెన్స్ సెంటర్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఎడ్విన్ ఆంథోనీ, డైరెక్టర్ డాక్టర్ కె.మమత తదితరులు పాల్గొన్నారు.
గీతంలో ‘అచీవర్స్ డే’ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



