నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రజల అభిప్రాయాలకు అద్దం పడుతూ సమాజ చైతన్యానికి
దిక్సూచిగా నవతెలంగాణ పత్రిక నిలుస్తున్నది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ పాఠకుల విశ్వాసాన్ని చూరగొంటోంది. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం నేపథ్యంలో ఆ పత్రికకు, యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, పాత్రికేయులకు, సిబ్బందికి, పాఠకులకు
హృదయపూర్వక శుభాకాంక్షలు. సత్యనిష్ట, నిష్పాక్షికత, సామాజిక బాధ్యతతో కూడిన జర్నలిజాన్ని మరింత ఉన్నత ప్రమాణాలతో కొనసాగించాలి. ప్రజలకు విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో నవతెలంగాణ పత్రిక కృషి ఎనలేనిది. అదే ఒరవడిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలి. ఈ వార్షికోత్సవం సంస్థకు నూతన ఉత్సాహాన్ని, ఆర్థికంగా పురోగతిని అందించాలి. పత్రికకు మరిన్ని విజయాలను తేవాలి.



