Saturday, August 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసామాన్య ప్రజానీకం గొంతుక

సామాన్య ప్రజానీకం గొంతుక

- Advertisement -

నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి

కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజానీకం గొంతుకగా నిలుస్తూ…వారి సమస్యలను సమాజం ముందుకు తీసుకొస్తూ… ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో నవ తెలంగాణ దినపత్రిక తనదైన పాత్రను పోషిస్తోంది. అణగారిన వర్గాల సమస్యలను నిత్యం వెలుగులోకి తీసుకొస్తూ పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంది. నవ తెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, పాత్రికేయులకు, సిబ్బందికి, పాఠకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజాయితీ, నిష్పాక్షికత, సామాజిక బాధ్యతను కాపాడుకుంటూ ప్రజలకు విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో నవ తెలంగాణ దిన‌ప‌త్రిక ప్రశంసనీయ సేవలు అందిస్తోంది. ఇదే నిబద్ధతతో ముందుకు సాగుతూ జర్నలిజంలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఈ వార్షికోత్సవం నవ తెలంగాణకు కొత్త ఉత్సాహాన్ని, మరింత అభివృద్ధిని, ఆర్థికంగా మరింత బలోపేతాన్ని తీసుకురావాలని… పత్రిక మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -