Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకారు ఢీకొని యువతి మృతి.. కుటుంబానికి సాయం చేస్తా: ఎంపీ కొడుకు

కారు ఢీకొని యువతి మృతి.. కుటుంబానికి సాయం చేస్తా: ఎంపీ కొడుకు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో కారు ఢీకొని యువతి మృతి చెందిన ఘటనలో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తనయుడు సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనలో తన నిర్లక్ష్యం ఏమీ లేదని సంజూష్ తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని, వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించి, అనంతరం పోలీసులకు వివరాలు తెలియజేశానని ఆయన పేర్కొన్నారు. ఆల్కహాల్ టెస్టులోనూ నెగటివ్ వచ్చిందని, పోలీసుల విచారణకు సహకరిస్తానని, బాధితురాలి కుటుంబానికి సాయం చేస్తానని సంజూష్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -