Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూనిక్ కథతో 'సీక్రెట్ సోల్జర్'

యూనిక్ కథతో ‘సీక్రెట్ సోల్జర్’

- Advertisement -

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం లో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యం గార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటివరకు ‘చైనా పీస్’ పేరుతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిత్రం ఇప్పుడు ‘సీక్రెట్ సోల్జర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ 16+ సర్టిఫికెట్ జారీ చేసింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఇప్పటివరకు మా సినిమాకి ‘చైనా పీస్టైటిల్తో ప్రచారం చేశాం. అయితే కథానుగుణంగా ఈ సినిమాకి 'సీక్రెట్ సోల్జర్ టైటిల్ బాగుంటుందని భావించి, మార్పు చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది` అని మేకర్స్ తెలిపారు. హర్షిత బండ్క మూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యం గార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాథ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -