నవతెలంగాణ-మునిపల్లి: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన భగత్ సింగ్ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ(ఎం) పార్టీ మండల నాయకుడు రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని బుదేరా చౌరస్తాలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసిన నివాలర్పించారు. అనంతరం విప్లవ వీరులను త్యాగాలను స్మరించుకున్నారు. స్వరాజ్యసాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను వదిలిన వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఉరికంబం వైపు నడుస్తూ ఎంత మాత్రం జంకగా భగత్ సింగ్ పాట పాడటం మొదలుపెట్టారు అని, ప్రాణం పోయినా నా మనస్సులో దేశంపై ప్రేమ చావదు, మట్టిలో కలిసినా నా శరీరం నుంచి ఈ దేశపు పరిమళ వాసనే వస్తుందంటూ పాడగా ఆయనతో రాజ్గురు, సుఖ్దేవ్ స్వరం కలిపారు అంటూ ఉరి వేసే ముందు భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడారు. అంటూ కొనియాడారు.ఈ కార్యక్రమంలో మల్లేశం, శేఖర్, యాదగౌడ్, ఖాజామియా, అంజన్న, శేఖర్, సురేష్, స్వామి, చంద్రయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



