Sunday, August 2, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఉల్లాసంగా..ఉత్సాహంగా..ఉత్తేజంగా..

ఉల్లాసంగా..ఉత్సాహంగా..ఉత్తేజంగా..

- Advertisement -

నవతెలంగాణ 11వ వార్షికోత్సవ సభ విజయవంతం
క్రీడాపోటీల విజేతలకు బహుమతుల అందజేత
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల అందజేత
కిక్కిరిసిపోయిన ఎస్వీకే మెయిన్‌‌హాల్‌
ఒకే వేదికపై అధికార, ప్రతిపక్ష, సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నవతెలంగాణ 11వ వార్షికోత్సవ సభ ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఉత్తేజ పూరిత వాతావరణంలో విజయ వంతంగా ముగిసింది. దానికి హైదరాబాద్‌‌లోని బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం శనివారం వేదికైంది. నిత్యం పదునైన మాటల బాణాలను పరస్పరం ఎక్కుపెట్టుకునే అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ‌నేతలు ‘రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం.. పత్రికా స్వేచ్ఛ’ అనే సెమినార్‌‌లో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు వ్యక్తిగతం కాకుండా సున్నితంగా విధానపరంగా ఉండాలనే సంకేతానిస్తూనే… తమిళనాడు నేతల తరహాలో రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి ఏకతాటిపైకి వచ్చి గళాలను ఎక్కుపెట్టాలనే సందేశాన్నిచ్చారు. బీజేపీ తన అధికారం కోసం రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యానికి, ప్రజాస్వామ్య ఖూనీకి పాల్పడుతున్న క్రమంలో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిపై సంఘటితంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌‌కుమార్‌ ‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ముక్తకంఠంతో నొక్కిచెప్పారు. కార్పొరేట్లు ప్రకటనలు ఇవ్వకపోయినా.. పాలకవర్గాలు చాలా సందర్భాల్లో యాడ్‌‌లు ఇవ్వకపోయినా..కరోనా లాంటి గండాన్ని దాటి ‘నవతెలంగాణ’ పత్రిక నిలదొక్కుకోవడంలో సిబ్బంది, విలేకర్లు పట్టుదల, అంకితభావం ఎంత చెప్పుకున్నా తక్కువేనని వారు కొనియాడారు. సంచలన వార్తల కోసం పాకులాడకుండా ప్రజా పక్షం వహిస్తూ ప్రజాగళాలను వినిపించడంలో నవతెలంగాణ పత్రిక పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు.

బహుమతుల ప్రదానోత్సవం.. 
నవతెలంగాణ కుటుంబ సభ్యుల సందడి…
నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా పురుషులు, మహిళలు, పిల్లలకు(రెండు కేటగిరీలు) నిర్వహించిన క్రీడాపోటీలు పదిరోజుల పాటు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. చిరుజల్లులను ఆస్వాదిస్తూ నవతెలంగాణ సిబ్బంది క్రీడాపోటీల్లో పాలుపంచుకున్నారు. ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన నవతెలంగాణ కుటుంబ సభ్యులకు ‌సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, సీజీఎం పి.ప్రభాకర్‌, ఎడిటర్‌ ‌రాంపల్లి రమేశ్‌ బహుమతులను అందజేశారు.

పురుషుల విభాగంలో…
క్రికెట్‌‌లో ప్రథమ బహుమతిని బ్యూరోటీమ్‌, ద్వితీయ బహుమతిని వెబ్‌‌సెక్షన్‌ ‌టీమ్‌ ‌సభ్యులు అందుకున్నారు. వాలీబాల్‌‌లో కె.ఎల్లయ్య టీమ్‌(ప్రథమ), బి.రాజేందర్‌(‌ద్వితీయ) టీమ్‌‌లు బహుమతులను పొందాయి. కబడ్డీలో హైదరాబాద్‌ ‌రీజియన్‌ ‌టీమ్‌(‌నరేశ్‌ ‌టీమ్‌) ‌ప్రథమ బహుమతిని, పీడీపీపీ టీమ్‌(‌టి.మధు) ద్వితీయ బహుతులను అందుకున్నాయి. టగ్‌ఆఫ్‌వార్‌‌లో కె.ఎలేందర్‌‌టీమ్‌ ప్రథమ బహుమతిని, పురుషోత్తమ్‌ ‌టీమ్‌ ‌దిత్వీయ బహుమతులను పొందాయి. బ్యాడ్మింటన్‌‌లో రత్నాకర్‌‌రావు-దుర్గయ్య టీమ్‌ ‌ప్రథమ బహుమతిని, జగదీశ్‌-‌శ్రీను టీమ్‌ ‌ద్వితీయ బహుమతిని అందుకున్నాయి. క్యారమ్స్‌‌లో కె.కిషన్‌-జె.సుధాకర్‌ (‌ప్రథమ), ఎమ్‌.హైదర్‌అలీ-బి.ఉపేందర్‌(‌ద్వితీయ) బహుమతులను పొందాయి. చెస్‌‌లో నవీన్‌(‌ప్రథమ) హైదర్‌అలీ(ద్వితీయ) బహుమతులను అందుకున్నారు.

మహిళా విజేతలు వీరే…
ఖోఖో(మహిళలు)లో ప్రథమ బహుమతిని స్వాతి టీమ్‌, ద్వితీయ బహుమతిని టి.భారతి టీమ్‌ అందుకున్నాయి. రింగ్‌‌బాల్‌‌లో కె.స్వాతి, అస్మా(ప్రథమ), టి.భారతి, దివ్య(ద్వితీయ) బహుమతులను అందుకున్నారు. టగాఫ్‌‌వార్‌‌లో పి. ధనలక్ష్మి టీమ్‌ (‌ప్రథమ), టి.భారతి(ద్వితీయ) బహుమతులను పొందాయి. స్కిప్పింగ్‌‌లో కె.స్వాతి(ప్రథమ), బ్రహ్మణి (ద్వితీయ), రన్నింగ్‌‌లో బి.జ్యోతి(ప్రథమ), జె.శైలజ (ద్వితీయ), డి.తేజస్విని(తృతీయ), లెమన్‌‌స్పూన్‌‌లో బి.జ్యోతి(ప్రథమ), జె.పావని(ద్వితీయ), డి.తేజస్విని (తృతీయ) బహుమతులను అందుకున్నారు. మ్యూజికల్‌ ‌చైర్‌‌లో టి.భారతి(ప్రథమ), జె.పావని(ద్వితీయ), ఈ.మేనక(తృతీయ), ముగ్గుల పోటీలో టి.స్వాతి(ప్రథమ), బి.జ్యోతి(ద్వితీయ), వైష్ణవి(తృతీయ) ప్రైజ్‌‌లను దక్కించుకున్నారు. క్యారమ్స్‌‌లో జె.పావని-పి.పూజ (ప్రథమ), అస్మా-బ్రహ్మణి(ద్వితీయ) బహుమతులను పొందారు.

చిన్నపిల్లల విభాగంలో…
లెమన్‌‌స్పూన్‌ చిన్నపిల్లల విభాగంలో ‌సామియా (ప్రథమ), ప్రజ్వల్‌ (‌ద్వితీయ), కృతివర్ధన్‌ (‌తృతీయ), పెద్ద పిల్లల విభాగంలో విహార్‌(‌ప్రథమ), జైనభ్‌(‌ద్వితీయ), ఆయేషా(తృతీయ) విజేతలుగా నిలిచారు. మ్యూజికల్‌ ‌చైర్‌ ‌చిన్నపిల్లల విభాగంలో ప్రజ్వల్‌ (‌ప్రథమ), మహోన్నత్‌ (ద్వితీయ), విహార్‌(‌తృతీయ), పెద్ద పిల్లల విభాగంలో హనీఫా(ప్రథమ), మేఘవర్ధిని(ద్వితీయ), సాత్విక (తృతీయ) బహుమతులను అందుకున్నారు. రన్నింగ్‌‌లో ఆరమ్‌(‌ప్రథమ), కృషిక(ద్వితీయ), ఆదిత్య(తృతీయ), హిమాన్షుకుమార్‌(ప్రథమ), విహార్‌(ద్వితీయ), జైనభ్‌ (‌తృతీయ), పి.వర్షిత్‌(‌ప్రథమ), ఆర్‌.సాన్విక (ద్వితీయ), అహద్‌(‌తృతీయ) బహుమతులను పొందారు. డ్రాయింగ్‌‌లో టి.హర్షిత(ప్రథమ), అమిత్‌(‌ద్వితీయ), ఆర్‌.తనీష్‌(‌తృతీయ), పెద్ద పిల్లల విభాగంలో నందన్‌ ‌విజయ్‌(‌ప్రథమ), ఆయేష్‌‌బేగ్‌ (‌ద్వితీయ), పి.సాత్విక (తృతీయ) బహుమతులను పొందారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నవతెలంగాణ 11వ వార్షికోత్సవ సభలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దాశరథి రంగాచార్యులపై త్రైలోక్య ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్యరూపకం ఆకట్టుకున్నది. వార్తల సేకరణలో జర్నలిస్టులు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి జీవితాలపై ‘విలేకరన్న…’ పాటను ప్రజానాట్యమండలి గాయకులు పి.ఆనంద్‌, తెలంగానం పాటను సైదులు, ఆ చల్లని సముద్ర గర్భం పాటను ఆనంద్‌ ఆలపించారు.

ఉత్తమ కథనాలు రాసిన జర్నలిస్టులకు అవార్డుల అందజేత
నవతెలంగాణ పదో వార్షికోత్సవం నుంచి 11వ వార్షికోత్సవం మధ్య కాలంలో ఉత్తమ కథనాలు రాసిన జర్నలిస్టులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. స్టేట్‌ ‌బ్యూరో ఉత్తమ కథనాల విభాగంలో ప్రథమ బహుమతిని అచ్చిన ప్రశాంత్‌‌కు, ద్వితీయ బహుమతిని బొల్లె జగదీశ్వర్‌‌కు కేటీఆర్‌ ‌తన చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందజేశారు. ప్రాంతీయ ప్రతినిధుల విభాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులను ఎ.పరిపూర్ణం, మీస మధులకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌‌కుమార్‌‌గౌడ్‌, రంగారెడ్డి రీజియన్‌ ‌ప్రతినిధుల విభాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులను సంజీవులు, బి.దేవేందర్‌, హైదరాబాద్‌ ‌రీజియన్‌ ‌ప్రతినిధుల విభాగంగా ప్రథమ, ద్వితీయ బహుమతులను తలారి శ్రీనివాస్‌, కలకూరి ఎల్లయ్యలకు కూనంనేని, జాన్‌‌వెస్లీలు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -