Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘోర విమాన ప్రమాదం.. 13 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. 13 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా లైన్స్ సమీపంలో శనివారం కూలిపోయిన పర్యాటక విమానంలో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పిస్కో విమానాశ్రయం నుంచి నాజ్కా లైన్స్‌ను వీక్షించేందుకు బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయి కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు ముందు రోజు బలమైన ఈదురుగాలులు, దుమ్ము కారణంగా ఆ ప్రాంతంలో పర్యాటక విమాన సర్వీసులను నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -