Monday, August 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'శ్రీ శ్రీ' ఫారిన్ షెడ్యూల్‌ పూర్తి

‘శ్రీ శ్రీ’ ఫారిన్ షెడ్యూల్‌ పూర్తి

- Advertisement -

హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ చిత్రం. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్, తొలి పాట ‘బొమ్మ బొమ్మ’కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫారిన్ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ ఫారిన్ షెడ్యూల్‌లో తెరకెక్కించిన ఎపిసోడ్స్ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలవనున్నాయి. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -