Monday, August 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపర్షిగా దేవి శ్రీ ప్రసాద్

పర్షిగా దేవి శ్రీ ప్రసాద్

- Advertisement -

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ‘బలగం’ చిత్రం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ సినిమా చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో పాటు హీరోగా పరిచయమౌతున్నారు. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ‘ఎల్లమ్మ’ చిత్ర బృందం ఆదివారం ‘పర్షి’గా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. అన్ని భాషల ప్రేక్షకులు ఈ పాత్రతో కనెక్ట్ అయ్యేలా ఉండబోతోందనే సంకేతాలు ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్నాయి. తొలి సినిమానే అయినప్పటికీ, డీఎస్పీ ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన తీరు దర్శకుడు వేణు ఎల్దండి విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో మేకర్స్‌ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.నాగార్జున 100 సినిమాకి మ్యూజిక్నాగార్జున అక్కినేని మైల్ స్టోన్ 100వ పై చిత్రంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు.ఆదివారం డీఎస్పీ 47వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసి, ఆయనకు ‘కింగ్ 100’ టీమ్‌లో ఘన స్వాగతం పలికారు. నాగార్జున – దేవిశ్రీ ప్రసాద్ లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాగార్జున ‘మన్మథుడు’, ‘మాస్’, ‘కింగ్’, ‘కుబేర’ చిత్రాలకు డీఎస్పీ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మైలురాయి చిత్రానికి కూడా అదే స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -