Monday, August 3, 2026
E-PAPER
Homeఆటలుతైపీ విజేత తన్వీ

తైపీ విజేత తన్వీ

- Advertisement -

ఫైనల్లో తన్వీ శర్మ ఘన విజయం
కెరీర్‌ తొలి వరల్డ్‌ టూర్‌‌ టైటిల్‌ సొంతం
తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ 300

తైపీ : 17 ఏండ్ల యువ షట్లర్‌ ‌తన్వీ శర్మ.. 18 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. 2008లో తొలిసారి సైనా నెహ్వాల్‌ ‌తైపీ ఓపెన్‌ ‌విజేతగా నిలువగా, ఆ తర్వాత మరో భారత షట్లర్‌ ఇక్కడ టైటిల్‌ ‌సాధించలేదు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ‌ఫైనల్లో వరల్డ్‌ ‌నం.21, ఆరో సీడ్‌ ‌లిన్హ్‌ (‌వియత్నాం)పై వరల్డ్‌ ‌నం.34 తన్వీ శర్మ అదిరే విజయం సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన టైటిల్‌ ‌పోరులో లిన్హ్‌‌ను 21-16, 21-16తో వరుస గేముల్లో తన్వీ శర్మ చిత్తు చేసింది. రెండు గేముల్లోనూ తన్వీ శర్మ సత్తా చాటింది. తొలి గేమ్‌‌లో 11-8తో ముందంజలో నిలిచిన తన్వీ శర్మ.. క్రాస్‌ ‌కోర్టు స్మాష్‌‌లు, నెట్‌ ‌డ్రాప్‌ ‌షాట్లతో అదరగొట్టింది. ఎటాకింగ్‌ ‌గేమ్‌‌తో పాటు కార్నర్‌ ‌షాట్లతో ప్రత్యర్థిని కోర్టు అంతా తప్పింది. క్రాస్‌ ‌కోర్టు స్మాష్‌‌లతో లిన్హ్‌ ‌రెండో గేమ్‌ ఆరంభంలోనే అలసిపోయింది. ఓ దశలో వరుసగా స్మాష్‌‌లు నెట్‌ ‌దగ్గరే ఆగిపోవటంతో తన్వీ శర్మ ఆధిక్యం కోల్పోయేలా కనిపించింది. కానీ, వేగంగా ఆట మార్చుకున్న తన్వీ శర్మ 36 నిమిషాల్లోనే మ్యాచ్‌‌ను ముగించింది. తైపీ ఓపెన్‌ ‌మహిళల సింగిల్స్‌ ‌చాంపియన్‌‌గా అవతరించింది. తన్వీ శర్మ కెరీర్‌లో ఇదే తొలి డబ్ల్యూబిఎఫ్‌ వరల్డ్‌ ‌టూర్‌ ‌టైటిల్‌. 2025 యుఎస్‌ ఓపెన్‌ ‌ఫైనల్‌‌కు చేరుకున్నా తన్వీ శర్మ రన్నరప్‌‌గానే నిలిచింది. ఒడిశా మాస్టర్స్‌ (‌సూపర్‌ 100), గువహటి మాస్టర్స్‌ ‌(సూపర్‌ 100) ‌టోర్నీల్లోనూ తన్వీ శర్మ రన్నరప్‌‌తో సరిపెట్టుకుంది. తైపీ ఓపెన్‌ ‌విజయంతో తన్వీ శర్మ టైటిల్‌ ‌వేటను ఘనంగా మొదలుపెట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -