- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి పార్లమెంట్ ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన బాటపట్టారు. దేశంలో గ్యాస్ కొరత ఉందని, ఖాళీ సిలిండర్లు, ఉత్త హామీలని బ్యానర్ చేతబూని బుధవారం ఎంపీలు నినాదాలు చేశారు. మోడీ సర్కార్ మాటలు తప్పా చేతల్లో ఏమి లేదని మండిపడ్డారు. అయితే ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, పరిణామాలు, దేశంలో నెలకొన్న చమురు నిల్వల కొరత, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు తదితర అంశాలపై మాట్లాడనున్నారు. ఈ భేటీకి అధికార, విపక్షాల పార్టీల నేతలు హాజరుకానున్నారు.
- Advertisement -



