Wednesday, August 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపారదర్శకంగా 
పోలీస్ ఉద్యోగ నియామకాలు

పారదర్శకంగా 
పోలీస్ ఉద్యోగ నియామకాలు

- Advertisement -

పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. నియమ, నిబంధనలనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీని ఆదేశించారు. కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటలీజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు చైర్మెన్‌ వివి.శ్రీనివాస రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -