ముంబయి: ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్(74) కన్నుమూశారు. ముంబయిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. 1952లో ఢిల్లీలో జన్మించిన ఆయన.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతోపాటు ఇతర భాషల్లో నటించారు. దూరదర్శన్ టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. కెరీర్ ప్రారంభంలో విలన్‌గా నటించిన ప్రదీప్ రావత్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేశారు. తెలుగులో నితిన్ – రాజమౌళి ‘సై’ (2004)తో ఆయన టాలీవుడ్ ప్రయాణం ప్రారంభమైంది. భిక్షూ యాదవ్‌గా ఆయన నటనకు అద్భుతమైన స్పందన లభించింది. 2004లో ఈ సినిమాకుగాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ విలన్, సంతోషం బెస్ట్ విలన్, నంది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించారు. భద్ర, అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ, స్టాలిన్, దేశముదురు, యోగి, జగడం, మస్కా, గజిని, రెబల్, నాయక్, ఓయ్, … ఇలా పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. హిందీలోనూ ప్రదీప్ రావత్ ప్రయాణం 1985లోనే మొదలైంది. రాజ్ బబ్బర్ ‘ఐత్ బార్’ సినిమాలో తొలిసారి ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించారు. ఆయన చివరి సినిమా ‘గాయపడ్డ సింహం’ మే 1న విడుదలైంది.
గుండెపోటుతో నటుడు ప్రదీప్ సింగ్ రావత్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



