Wednesday, August 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు టీవీకే తొలి బడ్జెట్..

నేడు టీవీకే తొలి బడ్జెట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులోని టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం నేడు శాసనసభలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల దృష్ట్యా, ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాల మధ్య సమతుల్యత పాటిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించడం ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఆర్థిక, ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వ విధానాలకు, ప్రాధాన్యతలకు ఈ బడ్జెట్ అద్దం పట్టనుంది. నిధుల కొరత కారణంగా ఇప్పటివరకు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాల ప్రకటనల విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ఇప్పటికే ప్రకటించిన ‘తైమామన్ తంగ మోదిరం’ పథకం మినహా ఇతర ప్రధాన ప్రకటనలేవీ వెలువడలేదు. అయితే, ఈ బడ్జెట్‌లో కొన్ని నూతన పథకాలు, పాలనాపరమైన సంస్కరణలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -