Wednesday, August 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు హరీష్‌రావు లీగల్‌ నోటీసులు

టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు హరీష్‌రావు లీగల్‌ నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు లీగల్‌ నోటీసులు పంపారు. హరీశ్‌రావు క్షుద్ర పూజలు నిర్వహించారని మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేరొంటూ తన న్యాయవాది ద్వారా నోటీసులిచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠకు నష్టం కలిగించే ఉద్దేశంతో చేసినవేనని పేరొన్నారు. ఆధారాల్లేని ఆరోపణలు కాంగ్రెస్‌ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమని హరీశ్‌ తరఫు న్యాయవాది వ్యాఖ్యానించారు. మహేశ్‌ వెంటనే తన వ్యాఖ్యలను వెనకి తీసుకొని క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని న్యాయవాది స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -