- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : చండీగఢ్‌లోని ఓ జ్యువెలరీ షోరూమ్‌కు సంబంధించిన మోసపూరిత కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని సోదరి అల్విరాఖాన్ అగ్నిహోత్రి, స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లకు చండీగఢ్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిర్యాదులోని ఆరోపణలపై తమ స్పందనలను దాఖలు చేయడానికి అక్టోబర్ 5న హాజరుకావాలని నిందితులందరినీ కోర్టు ఆదేశించింది. చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
- Advertisement -



