నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో సుమారు వందేళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మహౌలీ వార్డులో ఓ కుటుంబం నివసిస్తున్న పురాతన ఇల్లు భారీ వర్షానికి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో ఇంటి యజమాని ప్రమోద్ శ్రీవాస్తవ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (23)తో పాటు వారి ఇద్దరు పిల్లలు మాధవ్ (2), అద్విక్ (4 నెలలు) అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించారు.
భారీ వర్షాలు.. ఇండ్లు కూలి ఆరుగురి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


