Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅయినప్పటికీ రూ.50 కోట్లు కలెక్ట్‌ చేసింది

అయినప్పటికీ రూ.50 కోట్లు కలెక్ట్‌ చేసింది

- Advertisement -

‘కొబ్బరిమట్ట, హృదయకాలేయం, కలర్ ఫొటో, బేబి’ వంటి చిత్రాలతో రచయితగా, దర్శకుడిగా, నిర్మా తగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు సాయి రాజేష్. ఆయన కథ అందించి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తో కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపా యల వసూళ్లను దాటి రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయి రాజేష్ మీడియాతో పలు సినీ విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ఈ సినిమాకు మొదటి రెండు రోజులు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. వాకౌట్ అనే ప్రచారం చేశారు. నిజంగా ప్రేక్షకులు వాకౌట్ చేస్తే 50 కోట్ల రూపాయల వసూళ్లు దక్కవు కదా?, ‘బేబి’ సినిమా చూశాక కొందరు వైష్ణవి పాత్రను విమర్శిం చారు. విరాజ్ పాత్రలో క్లారిటీ లేదన్నారు. అలా విమర్శలు వచ్చాయి. కానీ, ఈ సినిమా విషయంలో కిరణ్, గౌరి పాత్రలకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదు. కథాపరంగా ‘కలర్ ఫొటో, బేబి’ కంటే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన చిత్రమిది. మనకు తెలిసి చాలా తక్కువ చిత్రాలు ఇలాంటివి వచ్చి ఉంటాయి. షాకింగ్ ఎలిమెంట్స్ తో నేను రాసుకున్న కథను ఇంత మంది ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం చాలా సంతోషాన్నిస్తోంది. మా సినిమా విజయం పట్ల సంతో షాన్ని వ్యక్తం చేస్తూ చిరంజీవి నాకు మెసేజ్ పంపారు. మరోసారి 50 కోట్ల గ్రాసర్ మూవీ చేశారని అభి నందించారు. తన అభిమానులు ఇలాంటి మంచి విజయాలు సాధించడం గర్వంగా ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -