Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅలరించే‘హుషార్‌ పిట్టలు’

అలరించే‘హుషార్‌ పిట్టలు’

- Advertisement -

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా నటించిన చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడి యెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. భిక్షు దర్శకుడు.
ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఈనెల 15న థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈనెల 10న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ,‘మా సినిమాను 15న విడుదల చేస్తున్నాం. కానీ, బుక్‌ మై షోలో ఇప్పటి నుంచే టిక్కెట్స్‌ సేల్‌ చేస్తున్నాం. ఈ సినిమా చూసి అం దరూ మరొకరికి రికమెండ్‌ చేస్తారు. దర్శకుడు కావాలన్న నా డ్రీమ్‌ నెరవేరింది. ట్రైలర్‌ చూసిన తరువాత సినిమా మీద అందరి ఓపినియన్‌ మారిపోతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా నచ్చి సపోర్ట్‌ చేస్తు న్నాను. తప్పకుండా ఈ సినిమా హిట్‌ కాబోతుందనే ఆత్మవిశ్వాసం అందరిలో కనిపిస్తుంది. సినిమా చూడగానే నాకు కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. నిర్మాత సురేష్‌ బాబు చూసి, నచ్చి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చాలా పెద్ద సినిమాల మధ్యలో వస్తుంది. సినిమా మీద నమ్మకంతోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందరి హృదయాలను హత్తుకుం టాయి. అన్ని వర్గాలకు నచ్చే సినిమా ఇది. ఇది కేవలం యూత్‌కే కాదు. మేసేజ్‌ ఉన్న కమర్షియల్‌ సినిమా. దర్శకుడు చాలా ఇంటలిజెంట్‌గా సినిమాను హ్యాండిల్‌ చేశాడు’ అని బెక్కెం వేణుగోపాల్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -