హీరో నాని పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సిని మాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఇక నుంచి ఈ జాగా ఎవరిది… ఈ దేశం ఎవరిది?’ అనే నాని పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. హై-వోల్టేజ్ యాక్షన్, రక్తం చిందించే బ్లడ్‌బాత్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ విజువల్స్‌తో ప్రతి క్షణం గూస్‌బంప్స్ తెప్పించేలా సాగింది. ప్రతి షాట్‌లో శ్రీకాంత్ ఓడెల విజన్ కనిపించింది. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని ఓ కొత్త ప్రపంచాన్ని ఈ టీజర్ ఆవిష్కరించింది. మోహన్ బాబు పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఆయన పలికిన డైలాగ్ టీజర్‌లోని ఇంటెన్సిటీని మరింత పెంచింది. కాయదు లోహర్, రాఘవ్ జుయాల్ పాత్రలు కూడా టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అని చిత్ర బృందం తెలిపింది. సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ జాగా ఎవరిది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



