- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పామిడి మండలం పొగరూరు సమీపంలో వ్యాన్‌ను ఢీకొన్న తర్వాత బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



