- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సి తండ్రి హొర్హే మెస్సి శనివారం కన్నుమూశారు. 68 ఏళ్ల హొర్హే.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మెస్సి ఫుట్‌బాల్‌లో పెద్ద స్టార్‌గా ఎదగడంలో హొర్హే కీలక పాత్ర పోషించారు. మెస్సికి ఏజెంట్‌గా ఉన్నారు. అతడి వ్యాపార వ్యవహారాలు చూసుకున్నారు. మెస్సి ప్రపంచకప్ ముగిసిన అనంతరం కొన్ని రోజులు తన తండ్రితో గడిపాడు. వారం కిందే ఇంటర్ మయామి క్లబ్‌తో చేరాడు. హొర్హే మృతికి దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య సంతాపం తెలిపింది.
- Advertisement -



