Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల వారీగా శనగ కొనుగోలు తేదీలను ప్రకటించిన ఏఓ

గ్రామాల వారీగా శనగ కొనుగోలు తేదీలను ప్రకటించిన ఏఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలో గ్రామాలలో  తేదిలవారీగా శనగ పంట కొనుగోలు నిర్వహిస్తామని జుక్కల్ మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఏవో మహేశ్వరి మాట్లాడుతూ మార్చి 26వ తేదీ నుండి మార్చి 30 వరకు బస్వాపూర్, ఖండేబల్లూర్, కేమ్రాజ్ కల్లాలిలో కొనుగోలు చేస్తా మని అన్నారు.

మార్చి 31 తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు పడంపల్లి , కత్తల్వాడి, బిజ్జల్ వాడి, పెద్ద ఎడ్గి, గ్రామాల రైతుల శనగలు, ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి 11వ తేదీ వరకు గుండూర్, సిద్దాపూర్,  ఖానాపూర్ , మై బాపూర్,  జుక్కల్ , గ్రామాల రైతుల, ఏప్రిల్ 12వ తేదీనుండీ 17వ తేదీ వరకు డోన్ గావ్,   కౌలాస్ , సాగర్ గావ్,  సోపూర్ , వజ్రకండి , మైలార్, ఏప్రిల్ 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు లాడేగావ్ , నాగల్ గావ్, చిన్న ఏడ్గి, మహ్మదాబాద్, గ్రామాల రైతులవి, ఏప్రిల్ 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు లొంగన్ , చిన్నగుల్లా, పెద్దగుల్లా,  గుల్లా తండా , కంటాలి గ్రామాల రైతులకు , ఏప్రిల్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు మాదాపూర్ , చెందేగావ్ , హంగర్గా , రైతులకు సంబంధించినవి సెనగ కొనుగోలు కేంద్ర అమ్మకానికి తీసుకురావాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ముందు తమ తమ క్లస్టర్ పరిధిలోని ఏఈవోలతో సంప్రదించి పత్రాలను వెంట తీసుకొని కొనుగోలు కేంద్రానికి రావాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -