Sunday, August 30, 2026
E-PAPER
Homeఆటలుటీమిండియా ఆటగాళ్లకు గాయాలు..బీసీసీఐ అత్యవసర భేటీ

టీమిండియా ఆటగాళ్లకు గాయాలు..బీసీసీఐ అత్యవసర భేటీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టులో పెరుగుతున్న ఆటగాళ్ల గాయాల సమస్యపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ నిర్వహణ, పునరావాస పురోగతిపై చర్చించారు. ప్రస్తుతం ఆకాష్ దీప్, బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ వంటి పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -