Sunday, August 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం..భార్యాభర్తలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..భార్యాభర్తలు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పోలవరం జిల్లాలోని మారేడుమిల్లి మండలం చీకటిగొప్పుల సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కారు బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. మృతులను కోరుకొండ మండలం రాఘవపురానికి చెందిన శ్రీను, శోభారాణిగా గుర్తించారు. మారేడుమిల్లికి విహారయాత్రకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -