Sunday, August 9, 2026
E-PAPER
Homeజాతీయంమమతా బెనర్జీ కారుపై రాళ్లతో దాడి

మమతా బెనర్జీ కారుపై రాళ్లతో దాడి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారుపై దాడి జరిగింది. కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఇటుకలు, రాళ్లతో తన కారుపై దాడి చేశారని, ఈ దాడిలో తృటిలో ప్రాణపాయం తప్పిందని ఆమె తెలియజేశారు. ఈ దాడిని ఆ రాష్ట్ర బీజేపీ ఖండించింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది.

పోలీసు కస్టడీలో మరణించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్తున్న హాలిసహర్‌లో మార్గంలో బెనర్జీ కారుపై ఒక్కసారిగా దాడులు జరిగాయి. నిరసనకారులు తృణమూల్ అధినేత్రి కారును చుట్టుముట్టి, దానిపై బురద పూసి, బూట్లు, నీళ్ల సీసాలు విసిరినట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా అక్కడి తరలించారు.

ఘటన తర్వాత బెనర్జీ విలేకరులతో మాట్లాడుతూ.. ఆ ఇటుకలు, రాళ్లు తనకే తగిలి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని, పోలీసుల సమక్షంలోనే బయటి నుంచి వచ్చిన అసాంఘిక శక్తులు నా కారుపై రాళ్లు విసిరాయి. ఒకవేళ నా కారు కిటికీలు మూసి లేకపోయి ఉంటే, అవి నా తలకు తగిలి ఉండేవి, అప్పుడు నేను చనిపోయేదాన్ని కూడా. ఇలాంటి దాడిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. మమ్మల్ని రక్షించడానికి పోలీసులు ఏమీ చేయలేదు. వారు కేవలం బీజేపీకి మాత్రమే రక్షణ కల్పిస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -