Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅలరించే అన్ని రకాల అంశాలతో ‘అగధ’

అలరించే అన్ని రకాల అంశాలతో ‘అగధ’

- Advertisement -

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ సినిమాని ఈనెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. ‘అగధ’ అని టైటిల్ పెట్టగానే చాలా మంది నెట్‌లో సర్చ్ చేశారు. అగధ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ‘అగధ’. ఇందులో హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని రకాల అంశాలు ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పని చేసే ఓ దుష్ట శక్తిని ‘అగధ’గా చూపించాను. నేను చూసిన రియాల్టీకి నా ఫాంటసీని జోడించి ఓ మంచి సిని మాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తీశాను. ప్రస్తుతం ఉన్న తరాన్ని అట్రాక్ట్ చేసేలా దుష్టశక్తి మీద ఓ సినిమాని తీయాలని అనుకుని ‘అగధ’ చేశాను. నేను ఇంత వరకు స్టేజ్ మీద ఓపెన్‌గా సినిమా బాగుంది అని స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ ‘అగధ’ చూసిన తర్వాత సినిమా బాగుంది, విజయం సాధిస్తుందని నా మన సుకి అనిపించింది. అదే విష యాన్ని చెప్పా. ముందు ఇక్కడ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత మిగతా భాషల్లో విడుదల చేయాలని అనుకుంటు న్నాను. అన్ని భాషల్లో డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. అరవై రోజుల తర్వాతే ఓటీటీకి ఇస్తామని అన్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -