Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇలాంటి విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవాలి

ఇలాంటి విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవాలి

- Advertisement -

హీరో వరుణ్ తేజ్ నటించిన నూతన సినిమా ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి మాట్లాడుతూ,‘ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుంది. ఇలాంటి విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తలవంచి ధన్యవాదాలు తెలియజేయడం మనందరి బాధ్యత. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం దర్శకుడు మేర్లపాక గాంధీ. జనాలకు నచ్చే అద్భుతమైన కంటెంట్‌ను అందించారు. హారర్ కామెడీ సినిమాలు ఇదివరకు చాలా వచ్చాయి. కానీ ‘కొరియన్ కనకరాజు’లో కొరియన్ ఫ్లేవర్‌ను, ఆ కల్చర్‌ను తీసుకురావడం చాలా గొప్ప ఆలోచన. ఈ విజయంలో ఆ ఆలోచన ప్రధాన కారణం. అందుకు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమా ఇంత కమర్షియల్‌గా అందరినీ అలరించిందంటే దానికి మరో ప్రధాన కారణం నా బిడ్డ వరుణ్ తేజ్. వరుణ్ మొదటి నుంచి వైవిధ్యమైన సినిమాలు, కథలు, పాత్రలు చేస్తున్నాడు. ‘ముకుంద’, ‘కంచె’, ‘అంతరిక్షం’ ఇలా ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. నటుడిగా ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటున్నాడు’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -