Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా : నాగార్జున

సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా : నాగార్జున

- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పళ్ళబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో నాగార్జున మాట్లాడుతూ,‘తల్లిదండ్రులను చూసుకోవడం కంటే అదృష్టం మరొకటి ఉండదు. నా తల్లిదండ్రులను నేను చూసుకున్నాను. వాళ్లు నన్ను చిన్నప్పుడు చూసు కున్నారు. మనకు చిన్నప్పుడు ఏ భయం వచ్చినా తల్లిదండ్రుల చేయి పట్టుకుంటాం. మనం పెద్దయ్యాక వాళ్ల బాధ్యతను తీసుకోవాలి. ఎవరైనా సరే తల్లి దండ్రులకు సేవ చేయాలి. అమల తన పేరెంట్స్ ని అద్భుతంగా చూసుకుంటుంది. తనతో ఎప్పుడూ చెబుతుంటాను.. తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరని. తల్లిదండ్రులను చూసుకోవడం చాలా ముఖ్యం. ఉదయ్ నాకు కథ చెప్పినప్పుడు ఇదే విషయం నాకు గుర్తుకు వచ్చింది. ఈ కథను అతను చాలా ఎంటర్టైనింగ్‌గా చెప్పాడు. సుధాకర్ రెడ్డి శంభూతాత పాత్రలో అద్భుతంగా చేశారు. మురళీధర్ గౌడ్ నటన కూడా చాలా బాగుంది. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. పవన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నేను సినిమా చూశాను. చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది. ఈ సినిమా చేసినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అందరూ ప్రేమించి తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కొత్త కథతో ఎవరైనా వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మా టీమ్‌కు కథ నచ్చితే, నేను తప్పకుండా కథ వింటాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -