Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆ నరేష్‌ని మళ్ళీ చూస్తారు

ఆ నరేష్‌ని మళ్ళీ చూస్తారు

- Advertisement -

హీరో అల్లరి నరేష్ నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ,‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దాదాపు పదేళ్లుగా మీరు మిస్ అయ్యారనుకున్న నరేష్‌ను ఇందులో చూస్తారు. రెండున్నర గంటల పాటు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మేమంతా చాలా కష్టపడ్డాం. చైతన్ భరద్వాజ్ చాలా మంచి పాటలు ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 4న కచ్చితంగా మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను. ఈ సినిమాతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని గ్యారెంటీగా చెబుతున్నాను’ అని అన్నారు. ‘నరేష్ తన వింటేజ్ కామెడీతో మీ అందరినీ అలరించబోతున్నారు. దర్శకుడు చంద్ర మోహన్ ఇప్పటివరకు నేను పనిచేసిన దర్శకుల్లో బెస్ట్ డైరెక్టర్. ఆయన ఏదైతే కథ చెప్పారో, అంతకంటే అద్భుతంగా సినిమాను తీశారు. థియేటర్లలో నవ్వుల మోత మోగిపోతుంది’ అని నిర్మాత రాజేష్ దండా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -