Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమ్మని ప్రేమించే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది

అమ్మని ప్రేమించే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది

- Advertisement -


హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్‌ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. కథానాయకుడు సూర్య మాట్లాడుతూ,‘ఈ సినిమాను మీరు థియేటర్లలో చూసి ఖచ్చితంగా ప్రేమిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు ప్రారంభం నుంచి త్రివిక్రమ్ ఆశీస్సులు ఉన్నాయి. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం గజినీ సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకున్నారు. రాధిక వల్ల ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది’ అని అన్నారు.
‘ఈ సినిమా నాకెంతో సంతృప్తిని ఇచ్చింది. థియేటర్లో చూసే ప్రేక్షకులకు కూడా ఆ సంతృప్తిని కలిగిస్తుంది. ఇది సూర్య అభిమానుల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు, సూర్య అభిమానుల కుటుంబాల కోసం కూడా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపూ మీ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది’ అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ‘తల్లికొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అమ్మని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత అమ్మని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. ఈ సినిమా త్రివిక్రమ్ గారికి చాలా నచ్చింది. ఆయన నచ్చిన సినిమా ఇంతవరకు మా బ్యానర్ లో ఫెయిల్ అవలేదు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -