Thursday, August 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమెరుగైన వేతనాలు.. బీమా భద్రత

మెరుగైన వేతనాలు.. బీమా భద్రత

- Advertisement -

ఆస్ట్రేలియాలో గిగ్ వర్కర్లకు సామాజిక ప్రయోజనాలు
రెండున్నర లక్షల మంది కార్మికులకు లబ్ది
సిడ్నీ :
ఆహార పదార్థాలు, కిరాణా సామగ్రిని డెలివరీ చేసే గిగ్ వర్కర్లకు జాతీయ కనీస వేతనం కంటే ఎక్కువగా గంటల వారీగా రేట్లు చెల్లించాలని, అలాగే విధినిర్వహణలో ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగితే బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని సూచిస్తూ ఆస్ట్రేలియా పెయిడ్ వర్క్ కమిషన్ (ఎఫ్‌డబ్ల్యూసీ) మంగళవారం రాత్రి ఓ ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం గిగ్ వర్కర్లకు జాతీయ కనీస వేతనం 26.44 డాలర్ల కంటే ఎక్కువగా…అంటే గంటకు 31.30 డాలర్లు చెల్లిస్తారు. అయితే డెలివరీ కోసం ఉపయోగించే వాహనాలకు థర్డ్ పార్టీ బీమా బాధ్యత వారి పైనే ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా కోసం కంపెనీలు సహేతుకమైన కనీస స్థాయి కవరేజీని అందించాల్సి ఉంటుంది. ఎఫ్‌డబ్ల్యూసీ జారీ చేసిన ఉత్తర్వు ఈ నెల 17వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. దీనివల్ల సుమారు రెండున్నర లక్షల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని అంచనా. పనిని అంగీకరించినప్పటి నుంచి డెలివరీని పూర్తి చేసే వరకూ పట్టే సమయానికి గిగ్ వర్కర్లకు కనీస గంటల వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది.గిగ్ వర్కర్ల కోసం నిర్దేశించిన ఉపాధి ప్రమాణాలను పాటించాలంటూ జూన్‌లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఉత్తర్వు జారీ అయింది. ఐఎల్‌ఓ నిర్దేశించిన ప్రమాణాలు గిగ్ వర్కర్లకు వేతనాలు, భద్రత, సామాజిక ప్రయోజనాల విషయంలో హక్కులు లభిస్తాయి. కాగా ఎఫ్‌డబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా రవాణా కార్మికుల సంఘం (టీడబ్ల్యూయూ) స్వాగతించింది. ఆస్ట్రేలియా గిగ్ ఎకానమికీ ఇది ఓ మైలురాయి అని అభివర్ణించింది. ‘దేశంలోని గిగ్ వర్కర్లు చాలా కాలం పాటు కార్యాలయ వ్యవస్థలకు దూరంగా ఉండిపోయారు. ఇక వారు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలకు అర్హులు అవుతారు’ అని టీడబ్ల్యూయూ జాతీయ కార్యదర్శి మైఖేల్ కెయిన్ చెప్పారు. రెస్టారెంట్ డెలివరీలకు ఆవల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉబర్ ఈట్స్, డోర్‌డాష్ సంస్థలు కూడా తాజా నిబంధనలపై హర్షం వ్యక్తం చేశాయి. కార్మికులకు బలమైన రక్షణ లభించడంతో పాటు గిగ్ వర్కర్లకు అనేక సౌకర్యాలు చేకూరుతాయని తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -