Thursday, August 13, 2026
E-PAPER
Homeఆటలుహెచ్‌‌సీఏ తీరు మారదా?

హెచ్‌‌సీఏ తీరు మారదా?

- Advertisement -

వరుస రాజ్యాంగ ఉల్లంఘనలపై టీసీఏ ఫైర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :

భారత క్రికెట్‌ ‌నియంత్రణ మండలి (బీసీసీఐ), సుప్రీంకోర్టు మార్గదర్శకాలు హైదరాబాద్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌ (‌హెచ్‌‌సీఏ) పరిధిని స్పష్టంగా జంట నగరాలకే పరిమితం చేసినా.. పదేపదే రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్న హెచ్‌‌సీఏపై తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్ (టీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ నెల 17న బీసీసీఐ అంబుడ్స్‌‌మన్‌ ‌వద్ద జిల్లా క్రికెటర్లు వేసిన పిటిషన్‌‌పై విచారణ జరుగనుంది. 90 ఏండ్లలో జిల్లాల క్రికెట్‌‌ను పట్టించుకోని హెచ్‌‌సీఏ ఇప్పుడు బీసీసీఐని, న్యాయస్థానాలను పక్కదారిపట్టించేందుకు అక్రమంగా, చట్టవిరుద్ధంగా జిల్లా క్రికెట్‌ కమిటీలు ఏర్పాటు చేస్తుంది. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాల్లోనూ రూల్స్‌‌ను పాటించటం లేదు. రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం కోసమే హెచ్‌‌సీఏ కొత్త నాటకానికి తెరతీసిందని’ టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ఆరోపించారు.

ఒకరికే రెండు పదవులా?
జస్టిస్‌ ‌లోధా కమిటీ సిఫారసులు, బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి రెండు (జోడు) పదవుల్లో కొనసాగడానికి అవకాశం లేదు. శేషు నారాయణను అధికారి ప్రతినిధిగా నియమించిన ఏకసభ్య కమిటీ, కార్యదర్శి.. తాజాగా అదే వ్యక్తిని జిల్లా క్రికెట్‌ ‌మౌలిక సదుపాయాల అభివృద్ది కమిటీకి చైర్మన్‌‌గా నియమించింది. ఇది నేరుగా విరుద్ధ ప్రయోజనాలకు కిందకు వస్తుంది. రూల్స్‌‌ను బాహాటంగానే తుంగలోతొక్కుతున్నా.. హెచ్‌‌సీఏ ఏకసభ్య కమిటీ మౌనం వహించటం ఏమిటని గురువారెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -