Thursday, August 13, 2026
E-PAPER
Homeఆటలుధనంజయ సారథ్యంలో…

ధనంజయ సారథ్యంలో…

- Advertisement -

భారత్‌‌తో టెస్టు సిరీస్‌‌కు 
శ్రీలంక జట్టు ఎంపిక
కొలంబో :
భారత్‌‌తో రెండు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్‌‌కు ఆతిథ్య శ్రీలంక బుధవారం జట్టును ప్రకటించింది. ధనంజయ డిసిల్వ సారథ్య పగ్గాలు నిలుపుకోగా… నిరోశన్‌ ‌డిక్‌‌వెల్లా, దిల్షాన్‌ ‌మధుశంకలు మూడేండ్ల తర్వాత తిరిగి జట్టులో చోటు సాధించారు. కేశర నువాంత, పసిందు సూరియబండారలు సైతం టెస్టు జట్టులోకి వచ్చారు. దినేశ్‌ చండిమాల్‌, కామిందు మెండిస్‌, ధనంజయ డిసిల్వలు బ్యాటింగ్‌ ‌లైనప్‌‌లో ఉండగా.. దినుశ, రమేశ్‌ ‌మెండిస్‌, రత్నానాయకెలు ఆల్‌‌రౌండర్లు. ముగ్గురు స్పిన్నర్లు, నలుగురు పేసర్లను సెలక్షన్‌ ‌కమిటీ ఎంపిక చేసింది. భారత్‌, శ్రీలంక తొలి టెస్టు గాలెలో శనివారం నుంచి ఆరంభం కానుంది.
శ్రీలంక టెస్టు జట్టు
ధనంజయ డిసిల్వ (కెప్టెన్‌), లహిరు ఉదర, నిశాన్‌ ‌మధుష్క, కామిందు మెండిస్‌, దినేశ్‌ ‌చండిమాల్‌, పసిందు సూరియబండార, సోనల్‌ ‌దినుశ, నిరోశన్‌ ‌డిక్‌‌వెల్లా, రమేశ్‌ ‌మెండిస్‌, ప్రభాత్‌ ‌జయసూరియ, కేశర నువాంత, మిలాన్‌ ‌రత్నానాయక, అషిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్‌ ‌మధుశంక.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -