Thursday, August 13, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందని ఘటన మండల పరిధిలోని గోవింద్ పేట్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్ర కిన్వాట్ కు చెందిన ప్రయాణికులు తీర్థయాత్రలకై రెండు ప్రయివేటు బస్సులలో హైదరాబాద్ కు పయనమయ్యారు. ఈ క్రమంలో గురువారం 44వ జాతీయ రహదారి గోవింద్ పేట్ బ్రిడ్జి వద్ద ముందున్న బస్సు టైర్ పంక్చర్ కావడంతో రెండు బస్సులను హైవేపై నిలిపివేశారు. దీంతో కొందరు ప్రయాణికులు విశ్రాంతికై రోడ్డు మధ్యలోని డివైడర్ పై కూర్చున్నారు.

అయితే కాసేపటికే మృత్యువులా వేగంగా దూకుకొచ్చిన కంటైనర్ లారీ ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు నేరుగా డివైడర్ మీద కూర్చున వారిపైకే వెళ్ళడంతో సుజాత, మాధురి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కంటైనర్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీపీ సాయి చైతన్య, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -