Thursday, August 13, 2026
E-PAPER
Homeఖమ్మంఉచిత ఆరోగ్య నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోండి

ఉచిత ఆరోగ్య నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోండి

- Advertisement -

– సర్పంచ్ పోలయ్య 
నవతెలంగాణ – అ‌శ్వారావుపేట

భవన నిర్మాణ రంగ కార్మికులకు కామన్ సర్వీస్ సెంటర్ హెల్త్ కేర్ ఆద్వర్యంలో నిర్వహించే ఉచిత ఆరోగ్య నిర్ధారణ రక్త పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సరిహద్దులు పోలయ్య తన ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని అచ్యుతాపురం గ్రామ పంచాయతీలోని కార్మికుల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకునేందుకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో వివిధ ఆరోగ్య పరిక్షలు చేశారు. 

ఈ సందర్భంగా లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కలిగిన కార్మికులకు యాభై కి పైగా వైద్య పరిక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నమన్నారు. పరిక్షల అనంతరం రోగులకు అందించాల్సిన మెరగైన వైద్య చికిత్సల కోసం సంభందిత ప్రభుత్వ దవాఖానాలకు పంపిస్తామని సిఎస్సీ కో – ఆర్డినేటర్ జి.సమహేష్ తెలియజేశారు. ఉచితంగా అందించే ఆరోగ్య వైద్య సేవలను కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్య పరీక్షల నిర్వహణలో ల్యాబ్ టెక్నీషియన్లు దుర్గ, పావని ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శి రమేష్,జీపీ అన్వేష్, గుమాస్తా మహేష్ లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -