Thursday, August 13, 2026
E-PAPER
Homeఖమ్మంఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం

ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -

– ఇంటి విద్యుదీకరణకు భరోసా
– మాజీ ఎమ్మెల్యే తాటి ఔదార్యం
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన కూతడి లక్ష్మణరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరగడంతో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గురువారం ఆయనను పరామర్శించారు. లక్ష్మణరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అండగా నిలుస్తూ తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా లక్ష్మణరావు సతీమణి తమ కుటుంబం గత 20 ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాటి వెంకటేశ్వర్లుకు వివరించారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని, రేపటిలోగా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామస్తులు కూర్చునేందుకు రెండు బల్లలు ఏర్పాటు చేయాలని కోరగా, వాటిని వెంటనే ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

మామిళ్లవారిగూడెంలో అనారోగ్యంతో ఉన్న కుటుంబానికి పరామర్శ: మండలంలోని మామిళ్లవారిగూడెం గ్రామంలో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కొడారి మహేశ్వరరావును తాటి వెంకటేశ్వర్లు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసాని నాగ శేష పద్మ –  చంద్రమోహన్ లు, డాక్టర్ భూక్య ప్రసాద్, ఆసుపాక మాజీ సర్పంచ్ పొట్ట రాజులు, జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, అశ్వారావుపేట పట్టణ మాజీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, వేదాంతపురం ఉప సర్పంచ్ సంగీత వీర్రాజు, మోటూరి మోహన్, నార్లపాటి చిన్నబ్బాయి, జుజ్జురపు రాంబాబు, న్యాయవాది ఉదయ్, జక్కుల రాంబాబు, కౌలూరి నరేష్, కాటూరి నాగు, పల్లెల శ్రీనివాస్, కాటూరి మంగరాజుతో పాటు యువకులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -