Thursday, August 13, 2026
E-PAPER
Homeఖమ్మంరెండో రోజూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

రెండో రోజూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో గురువారం రెండో రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ప్రదర్శించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ విద్యార్థులకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. తదుపరి బాలుర, బాలికల వసతి గృహాలను శుభ్రం చేస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్‌తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను అభినందించి ప్రోత్సహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -