- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో గురువారం నుంచి శనివారం వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -



