- Advertisement -
పరిశీలించిన తహసీల్దార్
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. రహదారిపై ఏర్పడిన గుంతల్లో కాంక్రీట్ మిక్సర్ ద్వారా మిశ్రమాన్ని పోసి పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డోంగ్లి మండల తహసీల్దార్ రంజిత్ కుమార్ పనులను పరిశీలించి, రహదారి మరమ్మతులు సక్రమంగా చేపట్టేలా సూచనలు చేశారు. ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది సాయిబాబా, గ్రామా నాయకులు విలాస్ పటేల్, పంచాయతీ కార్యదర్శి సవాయి సింగ్, వార్డు సభ్యుడు రమాకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



