- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కోడి మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలనే డిమాండ్‌తో రిటైల్ యజమానులు నేటి నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేశారు. గతంలో మార్జిన్ కేజీకి రూ.26 ఇవ్వగా ఇటీవల పౌల్ట్రీలు దాన్ని రూ.16కు తగ్గించాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఓనర్స్ అంటున్నారు. మార్జిన్‌ను రూ.30కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలో చికెన్ దుకాణాలు 2-3 రోజుల వరకు మూతపడే అవకాశం ఉంది.
- Advertisement -



