Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఏసిఎస్ కార్యాలయం ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పిఏసిఎస్ కార్యాలయం ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

– మూడు రంగుల మువ్వెన్నల జెండాను ఆవిష్కరించిన చైర్మన్ మొoడయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో చైర్మన్ ఇప్ప మొండయ్య ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు రంగుల మువ్వేన్నల జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు.ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల త్యాగపలమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలని చైర్మన్ చెప్పారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్,సిఈఓ సంతోష్,సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు,వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, సారయ్య,తిర్రి అశోక్, మేనం రాకెష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిఏసిఎస్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -