నవతెలంగాణ – మద్నూర్: ఉత్తమ సేవలు అందించినందుకు మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విట్టల్‌కు ప్రశంసా పత్రం అందించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ నవీన్ చంద్ర చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఇటీవల జరిగిన దారి దోపిడీ కేసు నిందితులను గుర్తించడంలో, అలాగే మద్నూర్ మండల కేంద్రంలో ఆరేళ్ల చిన్నారి తప్పిపోయిన ఘటనలో చాకచక్యంగా విధులు నిర్వహించి బాలికను గుర్తించడంలో విట్టల్ కీలకంగా వ్యవహరించారు. ఈ రెండు ఘటనల్లో ఆయన అందించిన ఉత్తమ సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ప్రశంసా పత్రంతో సత్కరించారు.
విట్టల్ ఉత్తమ సేవల ప్రశంసా పత్రం అందుకోవడంతో మద్నూర్ ఎస్ఐ మోహన్‌రెడ్డి, తోటి కానిస్టేబుళ్లు ఆయనను అభినందించారు.



