Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఎంపీడీవోగా జుక్కల్ శ్రీనివాస్

ఉత్తమ ఎంపీడీవోగా జుక్కల్ శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: కామారెడ్డి జిల్లాలో ఉత్తమ ఎంపీడీవోగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్‌కు గుర్తింపు లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా శ్రీనివాస్ ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జుక్కల్ మండలం త్రివేణి సంగమంలా మూడు భాషలు మాట్లాడే ప్రజలు కలిసి జీవిస్తున్న ప్రాంతం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంచి సంస్కృతి, సంప్రదాయాలను పాటించే పెద్దలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, నిబంధనలకు అనుగుణంగా గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు.

మండల సిబ్బంది, ప్రజలు తనకు అందించిన ఆదరాభిమానాలు, సహకారం మరువలేనివని పేర్కొన్నారు. తనను స్థానికుడిగా భావించి పనిచేసేందుకు సహకరించడం ప్రత్యేకంగా భావిస్తున్నానన్నారు. తాను చేసిన కృషిని జిల్లా అధికారులు గుర్తించి ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపిక అందించి సత్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -