- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను శనివారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



