నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు దేశభక్తిని చాటేలా వివిధ వేషధారణల్లో పాల్గొని ఆకట్టుకున్నారు. సైనికులు, మహాత్మా గాంధీ తదితర స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలను చిన్నారులు పోషించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకుమారి మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కంతి మధు,వార్డ్ సభ్యులు,సీనియర్ ఉపాధ్యాయులు భాస్కరాచారి, నరేష్, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



